Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

TSPSC:పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి..

  • టీఎస్‌పీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రెటరీ, శంకర లక్ష్మికి నోటీసులు జారీ

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖల చేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్‏ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారని అభియోగలపై ఈ డి విచారణ ప్రారంభించింది. కాగా.. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు.

శంకర్ లక్ష్మి తో పాటు టీఎస్‏పీఎస్‏సీ కి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో ఈడి పేర్కొంది.

టీఎస్‌పీఎస్‌సీ అభ్యర్థులు దాఖలు చేసిన కీలక పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ఎన్ఎస్‌యూఐ సహా పలువురు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *