వీణవంక మండలంలో రైతులను ముంచేత్తిన వడగళ్ల వాన
వీణవంక మండలంలో రైతులను ముంచేత్తిన వడగళ్ల వాన

పరిశీలించిన కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ
అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి
వీణవంక, మార్చి 18 (విశ్వం న్యూస్) : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వీణవంక మండలంలో నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించిన కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా కరీంనగర్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ కర్వేద మైపాల్ రెడ్డి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కిసాన్ మోర్చా జిల్లా ప్రభారి ఎర్రబెల్లి సంపత్ రావు, హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి నరసింహ రాజు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మడుగురి సమ్మిరెడ్డి బీజేవైఎం జిల్లా కార్యదర్శి చేపూరి రాజు కిసాన్ మోర్చా మండలాధ్యక్షుడు యువత తదితరులు హాజరయ్యారు.

