హైదరాబాద్

పీర్జాదిగూడ కార్పొరేషన్లో బలవంతపు వసూళ్లను నిలిపివేయాలి

పీర్జాదిగూడ కార్పొరేషన్లో బలవంతపు
వసూళ్లను నిలిపివేయాలి

  • కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు
    తుంగతుర్తి రవి పిలుపు..
  • మీరు ప్రజల పాలిట రక్షకులా..భక్షకులా..?

పీర్జాదీగూడ, మార్చి 29 (విశ్వం న్యూస్) : కరోనా లాక్ డౌన్, ఫ్లడ్స్ లాంటి సమస్యల నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రజల పాలిటా పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడటం సరికాదని కాంగ్రెస్ పార్టీ పీర్జాదీగూడ నగర పాలక అధ్యక్షుడు తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి కరోనా లాక్ డౌన్ కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్యంతో పాటు, అర్దిక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన సర్కారు ప్రజల పాలిటా గుదిబండగా మారటం సరికాదని అన్నారు. కార్పొరేషన్ అధికారులు వారి టార్గెట్ పూర్తి చేసుకోవడానికి గాను ప్రజల నుండి బలవంతంగా పన్నులు వసూళ్లు చేయడానికి ప్రజలను పిండిస్తున్నారని వాపోయారు.

ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని వారికి అండగా ఉండడం ప్రభుత్వ విధి.. కానీ అలా కాకుండా ప్రజల ముక్కు పిండి పన్నులు వసూలు చేయడం ఎంటని ప్రశ్నించారు. ఇలాంటి పద్దతులు అధికారులు మార్చుకొక పోతే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *