రాహుల్ గాంధీకి మద్దతుగా సత్య గ్రహ దీక్ష
రాహుల్ గాంధీకి
మద్దతుగా సత్య గ్రహ దీక్ష

కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్
హుజురాబాద్, మార్చి 29 (విశ్వం న్యూస్) : ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారిపై మోడీ ప్రభుత్వం పరువు నష్టం దావా కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సూరత్ హైకోర్టులో తీర్పు వచ్చిన సందర్భంగా సత్యాగ్రహ దీక్ష పేరట పిసిసి పిలుపుమేరకు అన్నినియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈరోజు హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన సత్యాగ్రహ దీక్షలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు హైకోర్టులో తీర్పు వెలువరించినప్పటికీ సుప్రీం కోర్టులో అపిల్ చేసుకోవడానికి ఒక నెల గడువు ఇచ్చినప్పటికీ దానిని లెక్కచేయకుండా వారి యొక్క లోక్ సభ సభ్యతాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల శ్యాంసుందర్ రెడ్డి, చదువు జయపాల్ రెడ్డి, రంజిత్, సలీం, పోతుల తిరుపతి, వెంకన్న, మండల రాజయ్య, అజయ్, సురేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
