లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన పాడి కౌశిక్ రెడ్డి
లబ్ధిదారులకు చెక్కులు
అందజేసిన పాడి కౌశిక్ రెడ్డి

- ఇంటింటికీ పాడి కౌశిక్ రెడ్డి
- కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీ
వీణవంక, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా మండలం వీణవంక పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కళ్యాణలక్ష్మి, షాది ముభారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ముసపట్ల తిరుపతిరెడ్డి, చల్లూరు సర్పంచ్ రమేష్ జ్యోతి, శ్యామ్ సుందర్ రెడ్డి, సాధవరెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

