దళిత రత్న అవార్డు అందుకున్నసరిగొమ్ముల మనోహర్
దళిత రత్న అవార్డు అందుకున్న
సరిగొమ్ముల మనోహర్

- బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక - చైర్మన్ మేడి పాపయ్య, జంగా శ్రీనివాస్,
మానాల చేతుల మీదుగా అవార్డు - అందుకున్న సంఘసంస్కర్త
సరిగోమ్ముల మనోహర్ మాదిగ
బోడుప్పల్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత సంఘాల నాయకులు చేసిన నిరంతర పోరాటాలను గుర్తించి దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జమ్మికుంట మండలం నూతన ఇల్లందకుంట మండల పరిధిలోని బూజునూర్ గ్రామ పంచాయతీకి చెందిన సరిగొమ్ముల మనోహర్ (తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు) కు ఈ దళిత రత్న అవార్డు వరించింది.

ఆయన నేపథ్యం బాల్య విద్యాభ్యాసం చేస్తున్న రోజులలోనే భారతదేశ స్వతంత్ర సమరయోధులను స్మరిస్తూ.. మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే, ప్రపంచ మేధావి, రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల ఆలోచన విధానంతో వారి త్యాగాలకు ఆకర్షితులై, వారి స్ఫూర్తితో నాటి నుంచి నేటి వరకు దళితులు బడుగు బలహీన వర్గాలకు చెందిన బహుజనుల పట్ల జరుగుతున్న అన్యాయాలను, వారిపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఎక్కడ అన్యాయం జగిగితే అక్కడ ఎదురు నిలబడి పోరాటo చేస్తున్న దళిత నాయకులు సరికొమ్ముల మనోహర్ మాదిగ ప్రస్థానాన్ని గుర్తించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి పాపయ్య మాదిగ, జంగా శ్రీనివాస్, తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మానాల రాజేశ్వరరావు, బి.ఎల్ రమేష్ మాదిగ ఇటుక రాజు మాదిగల అధ్యక్షతన ఈ అవార్డును అందుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ మా తల్లిదండ్రులు సరిగొమ్ముల లక్ష్మి ఓదెలు ఇచ్చిన మాట, నేర్పిన క్రమశిక్షణ ఈరోజు నన్ను ఇంతటి వాన్ని చేసిందని, మాజీ సర్పంచ్ గా మా అమ్మా లక్ష్మీ ఒదేలు మా ఊరికి చేసిన అభివృద్ధి, నాకు నేర్పిన రాజకీయ బాట ఈరోజు నన్ను తెలంగాణ ఎమ్మార్పీఎస్ సంఘంలో ఒక కార్యనిర్వాహక అధ్యక్షునిగా, దళిత బహుజనుల పట్ల నేను చేసిన పోరాటాలు, ఆరాటాలు పురస్కరించుకొని ఈరోజు ఆ మహానీయుడు, స్వతంత్ర సమరయోధుడు, బడుగుల ఆశాజీవి, భారతదేశ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నా దళిత బహుజనుల పట్ల నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతానని హామీ ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవార్డును ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక జై భీములు తెలియజేశారు.
